Asia Cup 2022: ఏం చేస్తున్నావు రోహిత్‌.. ఇదేనా నీ కెప్టెన్సీ? నిజంగా సిగ్గు చేటు!

7 Sep, 2022 12:53 IST|Sakshi

ఆసియాకప్‌-2022లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫీల్డ్‌లో తన ప్రశాంతతను కోల్పోయాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో క్యాచ్‌ జారవిడిచిన అర్ష్‌దీప్‌ సింగ్‌పై గట్టిగా అరవడం.. అదే విధంగా పంత్‌ ఔటయ్యాక క్లాస్‌ పీకడం వంటి సంఘటలను చూశాం.

అయితే మరో సారి రోహిత్‌ సహానాన్ని కోల్పోయాడు. ఆసియాకప్ సూపర్‌-4లో భాగంగా కీలక మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే శ్రీలంక విజయానికి అఖరి ఓవర్‌లో 7 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్‌ బంతిని అర్ష్‌దీప్‌ సింగ్‌ చేతికి ఇచ్చాడు.

అయితే అఖరి ఓవర్‌ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ రోహిత్‌ మాత్రం అర్ష్‌దీప్ మాటలను పట్టించుకోకుండా ముఖం తిప్పి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రోహిత్‌ ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.

ఇదేనా యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, నిజంగా సిగ్గు చేటు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్‌ అద్భుతమైన యార్కర్లను వేశాడు.  అయితే రెండు బంతుల్లో 2 పరుగులు అవసరమవ్వగా.. ఐదో బంతికి బైస్‌ రూపంలో శ్రీలంకకు విన్నింగ్‌ రన్స్‌ వచ్చాయి.


చదవండి: Ravindra Jadeja: జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

మరిన్ని వార్తలు