Sanju Samson: 'మరి అంత పనికిరాని వాడా?.. బీసీసీఐ కావాలనే చేస్తోంది'

9 Aug, 2022 18:27 IST|Sakshi

యూఏఈ వేదికగా ఈనెల 27 నుంచి జరగనున్న ఆసియా కప్‌లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే 15 మందితో కూడిన ఈ జట్టులో వికెట్ కీపర్, ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ పేరు లేకపోవడంపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జట్టు ప్రకటించిన తర్వాత బీసీసీఐపై అభిమానులు విమర్శలు గుప్పించారు. ''బీసీసీఐ కావాలనే సంజూ శాంసన్‌ను అణిచివేస్తుంది. అవకాశం ఇచ్చిన ప్రతీసారి తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అయినా కూడా అతనిపై వివక్ష చూపించడం బాధాకరం. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ కంటే శాంసన్ మెరుగైన ఆటగాడు.కేఎల్ రాహుల్ రాకతో ఓపెనింగ్ జోడీ (రోహిత్ శర్మ-రాహుల్)కి అవసరం లేకపోవడంతో ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టారు.

వన్ డౌన్‌లో కోహ్లీ బ్యాటింగ్‌‌కు వస్తాడు. మిడిలార్డర్ కోసం సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లు ఉన్నారు. దీంతో శ్రేయాస్ అయ్యర్‌ను బ్యాకప్‌గా ఎంపిక చేశారు. నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లకు అవకాశమిచ్చారు. అయితే కనీసం బ్యాకప్ ప్లేయర్‌గా కూడా శాంసన్ పనికిరాడా..?'' అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక 2022 ఏడాదిలో సంజూ శాంసన్‌ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒకసారి బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. మిగతా ఐదు ఇన్నింగ్స్‌లు కలిపి 179 పరుగులు చేశాడు. ఈ ఆరు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు శ్రీలంకపై, ఒక మ్యాచ్‌ ఐర్లాండ్‌పై, మరో రెండు విండీస్‌పై ఆడాడు. ఇందులో అత్యధిక స్కోరు 77 పరుగులు(ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో) సాధించాడు.

చదవండి: Rudi Koertzen Death: క్రికెట్‌లో విషాదం.. దిగ్గజ అంపైర్‌ కన్నుమూత

Hundred 2022: ఆరు సెకన్ల పాటు గాల్లోనే.. సెకన్ల వ్యవధిలో రెండు అద్భుతాలు

Asia Cup 2022 India Squad: అతడిని ఎంపిక చేయాల్సింది.. నేనే గనుక సెలక్టర్‌ అయితే..: మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు