కోహ్లి.. ఇది ఓవరాక్షన్‌ కాదా?

13 Oct, 2020 15:58 IST|Sakshi
ఫోర్‌ కొట్టిన తర్వాత కోహ్లి(ఫోటో సోర్స్‌: డిస్నీ హాట్‌స్టార్‌)

షార్జా: ఈ ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరొకసారి ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. గతంలో ఒక ఈజీ క్యాచ్‌ను వదిలేసి విమర్శలు పాలైన కోహ్లి.. ఈసారి బౌండరీ కారణంగా ట్రోల్‌ చేస్తున్నారు. బౌండరీ కొడితే ట్రోలింగ్‌ ఏమిటా అనుకుంటున్నారా?, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి కేవలం ఒకే ఒక్క బౌండరీ సాధించాడు. అది కూడా 19 ఓవర్‌లో ఒక ఫోర్‌ సాధించడం. కోహ్లి నిన్నటి మ్యాచ్‌లో 28 బంతులాడి 1 ఫోర్‌ సాయంతో 33 పరుగులు చేశాడు. కోహ్లి కొట్టిన ఫోర్‌ 25వ బంతికి వస్తే, దానికి కోహ్లి సెలబ్రేట్‌ చేసుకోవడం ట్రోలింగ్‌కు కారణమైంది. (ఫస్ట్‌ ఓవర్‌లోనే ఫైనల్‌ స్కోరు.. ఫిక్సింగ్‌ కాదా?)

ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నంలో కోహ్లి స్టైక్‌ రొటేట్‌ చేస్తూ ఆడిన సంగతి తెలిసిందే.  ఆ క్రమంలోనే కోహ్లి బౌండరీలకు యత్నించలేదు. కచ్చితంగా బోర్డుపై మంచి స్కోరు ఉంచాలనే ప్రయత్నమే కనిపించింది. కుదురుగా ఆడితే ఏదొక సమయంలో స్కోరు చేయవచ్చనే ఉద్దేశంతోనే కోహ్లి మెల్లగా ఆడాడు. ఇక్కడ కోహ్లి వ్యూహం ఫలించింది. ఫించ్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏబీడీ విశ్వరూపం ప్రదర్శించాడు.  బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తిచేస్తున్నాడు.  ఓవరాల్‌గా డివిలియర్స్‌ 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో అజేయంగా 73 పరుగులు చేశాడు.  ఇది ఆర్సీబీ మ్యాచ్‌ గెలవడానికి కారణమైంది. కోహ్లి నెమ్మదిగా ఆడటానికి వికెట్లను తొందరగా పాడేసుకోవడం ఇష్టం లేకనే ఇలా ఆడాడనేది వాస్తవం. 

కానీ కోహ్లి కొట్టింది ఒక ఫోర్‌. దానికి తనదైన శైలిలో సెలబ్రేట్‌ చేసుకోవడం విమర్శకుల నోటికి మళ్లీ పనిచెప్పింది. ‘ కోహ్లి.. నువ్వు సాధించిన బౌండరీ.. 25 బంతులు ఆడిన తర్వాత కొట్టావ్‌. అది ఏమి తొలి బంతికి కాదు’ అని ఒకరు ట్రోల్‌ చేయగా, ‘ కేకేఆర్‌ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన బంతి ఆఫ్‌ స్టంప్‌ బయటకు వేయడంతో అది ఎడ్జ్‌ పట్టుకుని ఫోర్‌కు పోయింది.. ఇక్కడ కోహ్లి సాధించింది ఏమీ లేదు.. ఇది ఓవరాక్షన్‌ కాదా’ అని మరొకరు ఎద్దేవా చేశారు.  డివిలియర్స్‌ సిక్స్‌లు, ఫోర్లు మోత మోగించినా అతను సింపుల్‌సిటీతో ఉన్నాడు.. మరి కోహ్లి ఒక్క ఫోర్‌కే అంత రియాక్షన్‌ అవసరం లేదు’ అని మరొక అభిమాని ట్రోల్‌ చేశాడు. కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా, కోహ్లి కొట్టిన ఫోర్‌కు రియాక్షన్‌ ట్రెండింగ్‌గా మారింది.  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది.

మరిన్ని వార్తలు