శాంసన్‌ విధ్వంసం : ఎంపీల మధ్య వార్‌

28 Sep, 2020 11:22 IST|Sakshi

ఐపీఎల్‌-2020 సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు అసలైన టీ-20 మజాను అందించింది. తొలుత బౌండరీల బాదుడుతో కింగ్స్‌ రెచ్చిపోతే.. ఆ తరువాత తామేమీ తక్కువ కాదంటూ రాయల్స్‌ సిక్సర్ల మోత మోగించారు. రాజస్తాన్‌ రాయల్స్‌ అసాధారణ బ్యాంటింగ్‌తో పంజాబ్‌ విధించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. ఆర్‌ఆర్‌ ఆటగాళ్లతో సంజూ శాంసన్‌తో పాటు రాహుల్‌ తేవటియా సంచలన ఇన్నింగ్స్‌తో కింగ్స్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఈ మ్యాచ్‌ ఐపీఎల్‌ చరిత్రంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందంటూ పలువురు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే నిన్నటి ఇన్నింగ్స్‌పై ఇద్దరు ఎంపీల మధ్య సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన వార్‌ మొదలైంది. (ఆ పని చేయలేకపోయాను: తెవాతియా

రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ అద్భుతమైన బ్యాటింగ్‌పై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ (కేరళ) ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. సూపర్బ్‌ షాట్స్‌తో ఆకట్టుకున్నావ్‌ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు. ‘శాంసన్‌ చాలా చక్కటి ఆటగాడు. సంజూ 14 ఏళ్ల వయసులోనే అతని ఆటచూశాను. అప్పుడే అనుకున్న ఇండియా టీంలోకి మరో ధోనీ రానుబోతున్నాడని. వరుస రెండు ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లతో తనేంటో ప్రపంచానికి చాటిచెప్పాడు’ అంటూ థరూర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. (ఆఖరి ఓవర్లలో... ఆరేశారు)

థరూర్‌ కామెంట్‌పై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాడు. శాంసన్‌ను వేరొకరిలా (ధోనీ) పొల్చాల్సిన అవసరం లేదు, అతనిలానే టీమిండియాలో గుర్తింపు పొందుతాడు అంటూ కౌంటర్‌ వేశాడు. సంజూని ధోనీతో పోల్చడం సరైనది కాదని ఎంపీ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. వీరిద్దరి సంభాషణపై సోషల్‌ మీడియాలో ఇరువురి అభిమానులు స్పందిస్తున్నారు. స్టీవ్‌ స్మిత్‌ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రాహుల్‌ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) దూకుడైన ఆటతీరుతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ఈ మ్యాచ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని వార్తలు