డోప్‌ టెస్టులో పట్టుబడ్డ ఇద్దరు భారత అథ్లెట్లు

14 Mar, 2021 05:26 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ తరఫున ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సిన ఇద్దరు భారత అథ్లెట్లు డోపీలుగా తేలారు. గత నెలలో పాటియాలా వేదికగా జరిగిన ఇండియన్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లో నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో వీరిద్దరు విఫలమైనట్లు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ శనివారం తెలిపారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ ఇద్దరు అథ్లెట్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో శక్తినిచ్చే మిథైల్‌హెక్సాన్‌–2–అమైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు. వీరిని త్వరలోనే ‘నాడా’ క్రమశిక్షణా ప్యానెల్‌ (ఏడీడీపీ) ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ దోషులుగా తేలితే వారిపై రెండు నుంచి నాలుగేళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు