పాజిటివ్‌ వస్తే మ్యాచ్‌ రెండు రోజులు వాయిదా

6 May, 2021 06:06 IST|Sakshi

‘యూరో కప్‌’లో కొత్త నిబంధన

జెనీవా (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్స్‌ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లలోని ఏ ఆటగాడైనా కరోనా బారిన పడితే... ఆ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌ను గరిష్టంగా రెండు రోజుల పాటు  వాయిదా వేసే కొత్త రూల్‌ను రూపొందించనట్లు పేర్కొంది. అంతేకాకుండా జట్టు సభ్యుల సంఖ్యను 23 నుంచి 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కరోనా వల్ల ఏ జట్టయినా తన మ్యాచ్‌ను ఆడకపోతే... 0–3తో ఆ జట్టు ఓడిందని, దానికి సంబంధిచిన పూర్తి పాయింట్ల్ల (3)ను ప్రత్యర్థి జట్టుకు అందజేసేలా నిబంధనను తీసుకొచ్చారు. జూన్‌ 11 నుంచి జూలై 11 వరకు 31 రోజుల పాటు యూరప్‌లోని 11 నగరాల్లో ఈ మెగా ఈవెంట్‌ జరగనుంది. 24 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మ్యాచ్‌ల సందర్భంగా 25 శాతం మంది అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు