అల్టిమేట్‌ ఖో–ఖో లీగ్‌ రంగం సిద్ధం.. ఎన్ని జట్లు అంటే!

14 Aug, 2022 05:19 IST|Sakshi

రాత్రి 8 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

పుణే: క్రీడాభిమానులను అలరించేందుకు మరో లీగ్‌ సిద్ధమైంది. గ్రామీణ క్రీడ ఖో–ఖో లీగ్‌కు నేడు తెర లేవనుంది. అల్టిమేట్‌ ఖో–ఖో లీగ్‌ పేరిట జరగనున్న ఈ టోర్నీలో ఆరు జట్లు (చెన్నై క్విక్‌గన్స్, గుజరాత్‌ జెయింట్స్, ముంబై ఖిలాడీస్, ఒడిషా జగర్‌నాట్స్, రాజస్తాన్‌ వారియర్స్, తెలుగు యోధాస్‌) టైటిల్‌ బరిలో ఉన్నాయి.

తొలి రోజు గుజరాత్‌ జెయింట్స్‌తో ముంబై ఖిలాడీస్, తెలుగు యోధాస్‌తో చెన్నై క్విక్‌గన్స్‌ తలపడతాయి. సెప్టెంబర్‌ నాలుగో తేదీన ఫైనల్‌ జరుగుతుందని అల్టిమేట్‌ ఖో–ఖో లీగ్‌ కమిషనర్, సీఈఓ టెన్‌జింగ్‌ నియోగి తెలిపారు. ప్రతిరోజు రెండు మ్యాచ్‌లు జరుగు తాయి. తొలి మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్‌ రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. సోనీ టెన్‌–1, సోనీ టెన్‌–3, సోనీ టెన్‌–4 చానెల్స్‌లో, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

మరిన్ని వార్తలు