‘టాప్‌’లోకి తెలుగు యోధాస్‌ 

24 Aug, 2022 07:07 IST|Sakshi

పుణే: అల్టిమేట్‌ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. ముంబై ఖిలాడీస్‌ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్‌ 55–43తో గెలిచింది. ఈ విజ యంతో తెలుగు యోధాస్‌ 12 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. కెప్టెన్‌ ప్రజ్వల్, సచిన్‌ భార్గవ్‌ తెలుగు యోధాస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రజ్వల్‌ 3 నిమిషాలు డిఫెండ్‌ చేయగా... సచిన్‌ 3 నిమిషాల 47 సెకన్లు డిఫెండ్‌ చేయడంతోపాటు అటాకింగ్‌లో పది పాయింట్లు కూడా స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో చెన్నై క్విక్‌గన్స్‌ 53–51తో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించింది. 

మరిన్ని వార్తలు