బౌలర్‌ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్‌ అంపైర్‌కు హక్కు ఉంటుందా?

21 Jun, 2022 14:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టి20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్‌, వార్విక్‌ షైర్‌ మధ్య మ్యాచ్‌లో  కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ చేసిన తప్పుకు ఫీల్డ్‌ అంపైర్‌ బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్‌ జట్టు తప్పు చేస్తే పీల్డ్‌ అంపైర్‌కు వెంటనే యాక్షన్‌ తీసుకునే హక్కు ఉంటుందా అని చాలా మందికి డౌట్‌ వచ్చింది. అయితే క్రికెట్‌ పుస్తకాలు మాత్రం అంపైర్‌కు ఆ హక్కు ఉంటుందని పేర్కొంటున్నాయి. క్రికెట్‌ పుస్తకాల్లోని లా 41.5 నిబంధనలు ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. ఒక బౌలర్‌ ఉద్దేశపూర్వకంగా బ్యాటర్‌ను గాయపరిస్తే అతనితో పాటు జట్టుపై ఫీల్డ్‌ అంపైర్‌ ఏ విధంగా యాక్షన్‌ తీసుకోవచ్చనేది పరిశీలిద్దాం

లా 41.5.1: ఈ నిబంధన ప్రకారం బౌలింగ్‌ జట్టులోని ఒక ఫీల్డర్‌.. బ్యాటర్‌ బంతి ఆడడానికి ముందు లేదా ఆడిన తర్వాత .. ఉద్దేశపూర్వకంగా తిట్టినా, దృష్టి మరల్చినా, అడ్డుకున్నా అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. 
లా 41.5.2: ఈ ఘటనపై ఫీల్డ్‌ అంపైర్‌ లేదా లెగ్‌ అంపైర్‌లో ఎవరో ఒకరు.. పీల్డర్‌ చేసింది ఉద్దేశపూర్వకమేనా లేక అనుకోకుండా జరిగిందా అన్నది పరిశీలించాలి
లా 41.5.3: ఒకవేళ ఫీల్డర్‌ లేదా బౌలర్‌ తప్పు ఉందని తేలితే..  మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లలో ఒకరు వెంటనే  బౌలింగ్‌ జట్టుకు వార్నింగ్‌ ఇస్తూ డెడ్‌ బాల్‌గా పరిగణించాలి. ఇదే సమయంలో మరో అంపైర్‌కు బంతిని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలి
లా 41.5.4: ఇలాంటి బంతులను డెడ్‌బాల్‌గా పరిగణించి.. బ్యాటర్‌ను నాటౌట్‌గా పరిగణిస్తారు.
లా 45.5.5: ఫీల్డర్‌ లేదా బౌలర్‌.. బ్యాటర్లతో ఫిజికల్‌గా ఏమైనా ఇన్వాల్వ్‌ అయ్యారా లేదా అని పరిశీలించాలి. ఒకవేళ ఫిజికల్‌ అని తేలితే.. లా 42 ప్రకారం(ఆటగాడి నిబంధన ఉల్లంఘన) ప్రకారం యాక్షన్‌ తీసుకోవాలి
లా 45.5.6: బౌలింగ్‌ జట్టు తప్పు ఉందని తేలితే.. ఫీల్డ్‌ అంపైర్‌  బ్యాటింగ్‌ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. ఆ తర్వాత ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు బౌలింగ్‌ జట్టు కెప్టెన్‌కు వివరిస్తారు.
లా 45.5.7: బౌలర్‌ వేసిన బంతిని పరిగణలోకి తీసుకోరు.. డెడ్‌బాల్‌గా కౌంట్‌ చేస్తారు.
లా 45.5.8: ఈ తతంగమంతా జరిగే లోపల బ్యాటర్లు పరుగు తీస్తే.. దానిని రద్దు చేయడం జరుగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లు సగం క్రీజు దాటితే మాత్రం​ పరుగు ఇవ్వడంతో పాటు అదనంగా ఐదు పరుగులు ఇస్తారు.
లా 45.5.9: స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్‌ తర్వాత బంతిని తాను ఆడాలా లేక నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ ఆడాలా అనే నిర్ణయం వాళ్లే తీసుకునే అవకాశం.
లా 45.5.10: ఆటలో భాగంగా జరిగిన తప్పిదాన్ని మ్యాచ్‌లో పాల్గొన్న ఇద్దరు అంపైర్లు రాతపూర్వకంగా గవర్నింగ్‌ కౌన్సిల్‌కు అందజేయాల్సి ఉంటుంది. బౌలింగ్‌ జట్టుపై ఏ యాక్షన్‌ తీసుకున్నారనేది వివరించాలి. 

మరిన్ని వార్తలు