T20 WC 2021: అంపైర్‌కు షాకిచ్చిన ఐసీసీ

2 Nov, 2021 13:38 IST|Sakshi

Umpire Michael Gough Removed From Duties T20 WC 2021: ఇంగ్లీష్‌ అంపైర్‌ మైకెల్‌ గాఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది. కరోనా నిబంధనలో భాగమైన బయోబబూల్‌ను ఉల్లఘించినందుకు గాఫ్‌ను ఆరురోజుల పాటు అంపైరింగ్‌ విధుల నుంచి తప్పిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. ప్రస్తుతం మైకెల్‌ గాఫ్‌ టి20 ప్రపంచకప్‌ 2021లో ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

విషయంలోకి వెళితే.. అక్టోబర్‌ 29న మైకెల్‌ గాఫ్‌ బయోబబూల్‌ను దాటి బయటికి వెళ్లి కొంతమందిని కలిశాడు. ఈ విషయం తెలుసుకున్న ఐసీసీ నిబంధనలు ఉల్లఘించినందుకుగానూ గాఫ్‌ను అంపైరింగ్‌ విధుల నుంచి తప్పించి ఆరు రోజుల పాటు కఠిన క్వారంటైన్‌కు తరలించింది. బెస్ట్‌ అంపైర్‌గా ప్రశంసలు పొందిన మైకెల్‌ గాఫ్‌ నిజానికి అక్టోబర్‌ 31న టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేయాల్సింది. కానీ 29న ఆయన బయెబబూల్‌ దాటి వ్యక్తులను కలవడంతో విషయం తెలుసుకున్న ఐసీసీ ఆయన్ను క్వారంటైన్‌కు తరలించింది. దీంతో గాఫ్‌ స్థానంలో సౌతాఫ్రికా అంపైర్‌ మరాయిస్‌ ఎరాస్మస్‌ అంపైరింగ్‌ విధులు నిర్వర్తించాడు. కాగా ఆరు రోజుల తర్వాత గాఫ్‌ తిరిగి ప్రపంచకప్‌లో అంపైరింగ్‌ విధులు నిర్వహిస్తాడా లేక బయోబబూల్‌ ఉల్లఘించినందుకు అతనిపై మరే విధంగానైనా చర్యలు తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

కాగా టి20 ప్రపంచకప్‌లో సూపర్‌ 12 దశలో గ్రూఫ్‌ 1 నుంచి ఇంగ్లండ్‌ సెమీస్‌కు చేరగా.. గ్రూఫ్‌ 2 నుంచి పాకిస్తాన్‌ మూడు విజయాలతో టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఇవాళ నమీబియాతో జరగబోయే మ్యాచ్‌లో పాక్‌ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది.

చదవండి: T20 WC 2021: అంపైర్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టీమిండియా, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు

మరిన్ని వార్తలు