IND vs NZ: గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్‌ బయటపడ్డ బెయిల్స్‌! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి

2 Feb, 2023 10:45 IST|Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన కీలకమైన మూడో టీ20లో 168 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. గిల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

కేవలం 63 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 126 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ కేవలం 66 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నాలుగు వికెట్లతో న్యూజిలాండ్‌ వెన్ను విరచగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, మావి తలా రెండు వికెట్లు సాధించాడు. కివిస్‌ బ్యాటర్లలో మిచెల్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

సంచలన బంతితో మెరిసిన ఉమ్రాన్‌
ఈ మ్యాచ్‌లో భారత స్పీడ్‌ స్టార్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ నిప్పులు చేరిగాడు. తన స్పీడ్‌తో కివీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌ విధ్వంసకర ఆటగాడు బ్రేస్‌వెల్‌ను ఓ అద్భుతమైన బంతితో మాలిక్‌ పెవిలియన్‌కు పంపాడు.

గంటకు 150 కిమీ వేగంతో మాలిక్‌ వేసిన డెలివరీని  బ్రేస్‌వెల్‌ ఆపే లోపే బంతి మిడిల్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఉమ్రాన్‌ స్పీడ్‌కు స్టంప్‌పైన ఉన్న బెయిల్ ఎగిరి ఏకంగా 30 యార్డ్‌ సర్కిల్‌ బయటపడటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్‌ చేసిన మాలిక్‌ 9 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.

చదవండి: Suryakumar: ఒకే స్టైల్‌లో రెండు స్టన్నింగ్‌ క్యాచ్‌లు.. 'స్కై' అని ఊరికే అనలేదు

మరిన్ని వార్తలు