Umran Malik: 'ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదన్న కోపమా.. కసిని చూపించాడు'

19 Oct, 2022 08:20 IST|Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో భాగంగా టీమిండియా పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన ఒక బంతి సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. 150 కిమీ స్పీడ్‌తో వచ్చిన బంతి మిడిల్‌ స్టంప్‌ను ఎగురగొట్టడమే కాదు.. వికెట్‌ను పిచ్‌ బయటకి పడేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు తన ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధ తెలియదో కానీ ఉమ్రాన్‌లో కసి మాత్రం స్పష్టంగా కనిపించిందని అభిమానులు కామెంట్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌, మహారాష్ట్ర మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇతని ఖాతాలో మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ వికెట్‌ కూడా ఉంది.

ఇక తొలుత నెట్‌ బౌలర్‌గా టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఉమ్రాన్‌ ఆస్ట్రేలియాకు కూడా వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో ఉమ్రాన్‌ మాలిక్‌ను పంపడం లేదని బీసీసీఐ తెలిపింది. దీంతో అతని ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశ చెందారు. ఆ తర్వాత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడుతున్న ఉమ్రాన్‌ మాలిక్‌ తన బౌలింగ్‌ పవరేంటో చూపిస్తున్నాడు.

చదవండి: 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం'

40 పరుగులకే ఆలౌట్‌.. టోర్నీ చరిత్రలో చెత్త రికార్డు

మరిన్ని వార్తలు