Germany Boxer Musa Yamak Death: రింగ్‌లోనే  కుప్పకూలిన బాక్సర్‌.. వీడియో వైరల్‌

19 May, 2022 18:12 IST|Sakshi
ముసా యమక్‌, జర్మనీ బాక్సర్‌

జర్మనీ స్టార్‌ బాక్సర్ ముసా యమక్ మరణం క్రీడాలోకాన్ని దిగ్రాంతికి గురి చేసింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ముసా యమక్‌ రింగ్‌లోనే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో షేర్‌ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. 38 సంవత్సరాల జర్మన్ ఛాంపియన్ మూసా యమక్ గత శనివారం ఉగాండకి చెందిన హమ్జా వాండెరతో బాక్సింగ్‌కి దిగాడు. వీరిద్దరి మధ్య మూడు సెట్ల మ్యాచ్ జరుగుతుండగా.. సెకండ్ రౌండ్‌లో వాండెర బలంగా మూసాని బలంగా గుద్దాడు. దాంతో మూడో రౌండ్ ముందు రింగ్‌లోకి రాగానే మూసా కుప్పకూలినట్లు పలు పత్రికలుధ్రువీకరించాయి. రింగ్‌లోనే మూసా కుప్పకూలడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే బాక్సర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు.

కాగా టర్కిష్ సంతతికి చెందిన యమక్ 2017లో బాక్సింగ్‌లోకి వచ్చినా.. 2021లో డబ్ల్యూబీఫెడ్ ఇంటర్నేషనల్ టైటిల్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. యూరోపియన్, ఆసియన్ ఛాంపియన్ షిప్ గెలిచిన మూసా యమక్ మరణంపై తోటి బాక్సర్లు తమ సంతాపం ప్రకటించారు.

చదవండి: Womens World Boxing Championships: పసిడికి పంచ్‌ దూరంలో...

మరిన్ని వార్తలు