Under-19 World Cup Final: 'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం'

5 Feb, 2022 22:16 IST|Sakshi

అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమిండియాతో ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తడబడింది. 44.5 ఓవర్లలో 189 పరుగులు వద్ద ఆలౌటైంది. ఆరంభం నుంచే టీమిండియా కుర్రాళ్లు బౌలింగ్‌లో చెలరేగడంతో ఇంగ్లండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. కానీ ఒక్కడు మాత్రం భారత్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని నిలబడ్డాడు. అతనే జేమ్స్‌ రూ.. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన జేమ్స్‌ రూ.. చివరివరకు నిలబడ్డాడు.


తాను నిలబడడమే కాదు.. అసలు వంద పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగిన దశలో ఒక్కో పరుగు జత చేస్తూ జేమ్స్‌ రూ ఇన్నింగ్స్‌ నడిపించిన విధానం అద్బుతమనే చెప్పాలి. సహచరులు వెనుదిరుగుతున్నా.. తాను మాత్రం పట్టు సడలకుండా ఆడాడు. 116 బంతులెదుర్కొన్న జేమ్స్‌ రూ 12 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. ఇక సెంచరీ ఖామమనుకుంటున్న దశలో 95 పరుగుల వద్ద రవికుమార్‌ బౌలింగ్‌లో కౌషల్‌ తంబేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగడం జేమ్స్‌ గుండెను ముక్కలు చేసింది. 

అయితే జేమ్స్‌ అసాధారణ పోరాటంతోనే ఇంగ్లండ్‌ కనీసం 189 పరుగులైనా చేయగలిగింది. ''కఠిన పరిస్థితుల్లో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడావు జేమ్స్‌ రూ.. ప్రత్యర్థి ఆటగాడినైప్పటికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం..19 ఏళ్ల వయసులోనే ఇంత ఓపికతో ఆడిన జేమ్స్‌ రూకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ మంచి భవిష్యత్తు ఉందంటూ'' టీమిండియా ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు