ICC WTC Updated Points Table: ఆసీస్‌ అగ్రపీఠాన్ని కదిలించి మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక

12 Jul, 2022 10:57 IST|Sakshi

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ 2021-23లో భాగంగా తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో శ్రీలంక రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. అలాగే ఆసీస్‌ అగ్రపీఠాన్ని సైతం కదిలించి రెండో స్థానానికి పడదోసింది. 

ఈ సీజన్‌లో మొదటి ఓటమిని ఎదుర్కొన్న ఆసీస్‌.. 70 శాతం విన్నింగ్‌ పర్సంటేజీతో రెండో స్థానానికి దిగజారగా.. 71.43 విజయాల శాతం కలిగిన సౌతాఫ్రికా అగ్రస్థానానికి ఎగబాకింది. 54.17 శాతం విన్నింగ్‌ పర్సంటేజీ కలిగిన శ్రీలంక మూడో స్థానంలో, 52.38 విజయాల శాతంతో పాకిస్థాన్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో ఓటమిపాలై 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సిరీస్‌ను సమం చేసుకున్న టీమిండియా ఈ జాబితాలో ఐదో స్థానంలో (52.08) నిలువగా.. వెస్టిండీస్‌ (50), ఇంగ్లండ్‌ (33.33), న్యూజిలాండ్‌ (25.93), బంగ్లాదేశ్‌ (13.33) వరుసగా ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.  

టీమిండియాను సైతం పడదోసిన శ్రీలంక..
ఆసీస్‌పై విక్టరీతో శ్రీలంక తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవడంతో పాటు టీమిండియాకు కూడా షాకిచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు మూడో స్థానంలో భారత జట్టు ఏకంగా రెండు స్థానాలు కోల్పోయి ఐదో స్థానానికి దిగజారింది. 
చదవండి: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న బట్లర్‌.. మరో సిరీస్‌ లక్ష్యంగా హిట్‌మ్యాన్‌

మరిన్ని వార్తలు