WTC Points Table: అగ్రస్థానం కోల్పోయిన ఆసీస్.. టీమిండియా ప్లేస్‌ ఎంతంటే..?

10 Jan, 2022 20:22 IST|Sakshi

యాషెస్ సిరీస్‌ 2021-22లో భాగంగా సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ డ్రా అయిన నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2021-23) పాయింట్ల పట్టికలో ఆసీస్‌ అగ్రస్థానాన్ని కోల్పోయింది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓ డ్రా, 3 విజయాలు సాధించిన ఆసీస్‌(40 పాయింట్లు).. 83.33 పాయింట్ల శాతానికి పడిపోవడంతో 100 శాతం పాయింట్లు ఉన్న శ్రీలంక అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుత డబ్ల్యూటీసీలో శ్రీలంక ఆడిన టెస్ట్‌ల్లోనూ విజయాలు నమోదు చేసి 24 పాయింట్లు సాధించింది. 


ఈ జాబితాలో పాకిస్థాన్ 36 పాయింట్ల(4 టెస్ట్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో 75 శాతం పాయింట్లు)తో మూడో స్థానంలో నిలువగా, టీమిండియా 53 పాయింట్ల(8 టెస్ట్‌ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, 2 డ్రాలతో 55.21 శాతం పాయింట్లు)తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. జొహనెస్‌బర్గ్ టెస్ట్‌లో టీమిండియాను ఓడించిన దక్షిణాఫ్రికా ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది. 

దక్షిణాఫ్రికా తర్వాత బంగ్లాదేశ్‌ 12 పాయింట్ల(3 టెస్ట్‌ల్లో ఓ విజయం, 2 పరాజయాలతో 33.33 శాతం పాయింట్లు), వెస్టిండీస్‌ 12 పాయింట్ల(4 టెస్ట్‌ల్లో ఓ విజయం, 3 పరాజయాలతో 25.00 శాతం పాయింట్లు),  న్యూజిలాండ్ 4 పాయింట్ల(3 టెస్ట్‌ల్లో 2 పరాజయాలు, ఓ డ్రాతో 11.11 శాతం పాయింట్లు), ఇంగ్లండ్‌ (8 టెస్ట్‌ల్లో ఓ విజయం, 5 పరాజయాలు, 2 డ్రాలతో 10.41 శాతం పాయింట్లతో 10 పాయింట్లు) జట్లు వరుసగా 7, 8, 9,10 స్థానాల్లో ఉన్నాయి.
చదవండి: IPL 2022: శ్రేయస్‌కు షాక్‌.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా..!

మరిన్ని వార్తలు