వెర్‌స్టాపెన్‌కు తొమ్మిదో ‘పోల్‌’ 

25 Oct, 2021 09:22 IST|Sakshi

ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ తొమ్మిదో పోల్‌ పొజిషన్‌ సొంతం చేసుకున్నాడు. యూఎస్‌ఏ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 32.910 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ హామిల్టన్‌ రెండో స్థానంలో, రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ పెరెజ్‌ మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌ ఏడు రేసుల్లో విజేతగా నిలిచి 262.5 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు