17 ఏళ్ల తర్వాత తొలి ఓటమి

26 Jul, 2021 06:36 IST|Sakshi

ఒలింపిక్స్‌ బాస్కెట్‌బాల్‌లో అమెరికా పురుషుల జట్టుకు షాక్‌

టోక్యో: గత మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో అజేయంగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించిన అమెరికా పురుషుల బాస్కెట్‌బాల్‌ జట్టుకు టోక్యో ఒలింపిక్స్‌లో తొలి మ్యాచ్‌లోనూ అనూహ్య పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 83–76 పాయింట్ల తేడాతో అమెరికా జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. అమెరికా స్టార్‌ ప్లేయర్‌ కెవిన్‌ డురాంట్‌ మ్యాచ్‌లో మరో 16 నిమిషాలు ఉందనగా నాలుగో ఫౌల్‌ చేసి వైదొలగడం జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసింది. డురాంట్‌ నిష్క్రమించాక ఫ్రాన్స్‌ ఆధిపత్యం చలాయించి చివరకు అమెరికాకు షాక్‌ ఇచ్చింది. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిపోయాక అమెరికా జట్టుకు ఒలింపిక్స్‌లో ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు