Emma Raducanu: యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్‌

31 Aug, 2022 08:50 IST|Sakshi
Photo Credit: US Open Twitter

యూఎస్‌ ఓపెన్‌లో బుధవారం తెల్లవారుజామున పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో బ్రిటన్‌ స్టార్‌.. డిఫెండింగ్ ఛాంపియన్ ఎమ్మా రాడుకానుకు బిగ్‌షాక్‌ తగిలింది. తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి అలిజె కార్నెట్‌ చేతిలో 6-3, 6-3తో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన మరుసటి ఏడాదే తొలి రౌండ్‌లో వెనుదిరిగిన మూడో క్రీడాకారిణిగా ఎమ్మా రాడుకాను నిలిచింది.

ఇంతకముందు 2004లో యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన స్వెత్లానా కుజ్నెత్సోవా.. మరుసటి ఏడాది తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఇక 2016లో విజేతగా నిలిచిన ఏంజెలిక్‌ కెర్బర్‌.. మరుసటి ఏడాది నవోమి ఒసాకా చేతిలో తొలి రౌండ్‌లోనే చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. ఇక 40వ ర్యాంకర్‌ అయిన అలిజా కార్నెట్‌ రికార్డు స్థాయిలో 63వ గ్రాండ్‌స్లామ్‌ ఆడుతుండడం విశేషం. అయితే ఇప్పటివరకు క్వార్టర్స్ వరకు మాత్రమే వెల్లగలిగింది. అయితే ఈ సీజన్‌లో టాప్‌ 20లో ఉన్న ఆరుగురు క్రీడాకారిణులను ఓడించడం విశేషం.

చదవండి: US Open 2022: యూఎస్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు

మరిన్ని వార్తలు