Us Open 2021: ఎమ్మా రెడుకాను గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

12 Sep, 2021 13:02 IST|Sakshi

న్యూయార్క్యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ గెలిచి ఎమ్మా రెడుకాను సంచలనం సృష్టించింది. 44 ఏళ్ల తర్వాత యూఎస్ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుకున్న బ్రిటన్‌ మహిళగా ఎమ్మా రికార్డు క్రియేట్‌ చేసింది. అయితే గ్రాండ్‌స్లామ్‌ విజేతలకు ప్రైజ్‌మనీ ఎంత అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ విజేతలకు నిర్వాహకులు ఈ ఏడాది ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ  57 లక్షల డాలర్లు  (సుమారు రూ.422 కోట్లు). గత ఏడాది కంటే 4 లక్షల డాలర‍్లు ఎక్కువగా పెంచారు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ కావడం విశేషం.

ప్రైజ్‌మనీ వివరాలు:
యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిస్తే 25 లక్షల డాలర్లు (రూ.18 కోట్లు), రన్నరప్‌కు 12 లక్షల డాలర్లు (రూ.9 కోట్లు), సెమీఫైనలిస్ట్‌ల​కు 6 లక్షల డాలర్లు (రూ.4 కోట్లు), క్వార్టర్‌ ఫైనలిస్ట్‌ల​కు 4లక్షల డాలర్లు (రూ.3 కోట్లు), రౌండ్‌16 ఆటగాళ్లకు (రూ.2 కోట్లు), రౌండ్‌ 32 ఆటగాళ్లకు (సుమారు రూ.1 కోటి 30 లక్షలు), రౌండ్‌ 64 ఆటగాళ్లకు (రూ.84 లక్షలు) , రౌండ్‌ 128(రూ.55 లక్షలు)గా నిర్ణయించారు.

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలిస్తే  6 లక్షల డాలర్లు (సూమారు రూ.5 కోట్లు),  రన్నరప్‌కు 3 లక్షల డాలర్లు (సూమారు రూ.2 కోట్లు), సెమీఫైనలిస్ట్‌ల​కు 1 లక్ష 64 వేల  డాలర్లు (రూ.1 కోటి 24 లక్షలు), క్వార్టర్‌ ఫైనలిస్ట్‌ల​కు (రూ.68 లక్షలు), రౌండ్‌16 ఆటగాళ్లకు (రూ.39 లక్షలు), రౌండ్‌ 32 ఆటగాళ్లకు( రూ.24 లక్షలు), రౌండ్‌ 64 ఆటగాళ్లకు (రూ.14 లక్షలు)గా నిర్ణయించారు.

చదవండిCPL 2021 Nicholas Pooran: సిక్సర్లతో శివమెత్తిన పూరన్‌.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా

>
మరిన్ని వార్తలు