యూకీ బాంబ్రీ నిష్క్రమణ

27 Aug, 2022 05:41 IST|Sakshi

న్యూయార్క్‌: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విభాగంలో క్వాలిఫయింగ్‌ దశలోనే భారత్‌ పోరాటం ముగిసింది. రెండో క్వాలిఫయిగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ 3–6, 2–6 స్కోరుతో జిజో బెరŠగ్స్‌ (బెల్జియం) చేతిలో ఓటమిపాలయ్యాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 552వ స్థానంలో ఉన్న యూకీ 155వ ర్యాంక్‌లో ఉన్న ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. ఈ టోర్నీలో ఇంతకు ముందే క్వాలిఫయింగ్‌ దశలో భారత ఆటగాళ్లు రామ్‌కుమార్‌ రామనాథన్, సుమీత్‌ నగాల్‌ ఓడిపోయారు.

మరిన్ని వార్తలు