ICC U-19 Womens T20 WC: పేరుకు మాత్రమే అమెరికా.. జట్టు మొత్తం మనోళ్లే

15 Dec, 2022 18:04 IST|Sakshi

వచ్చే ఏడాది జనవరిలో తొలిసారి ఐసీసీ అండర్‌-19 వుమెస్స్‌ టి20 వరల్డ్‌కప్‌ జరగనుంది. సౌతాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొననున్నాయి. కాగా 11 దేశాలు ఐసీసీ ఫుల్‌టైం మెంబర్స్‌ కాగా.. మిగతా ఐదు దేశాలను మాత్రం ఐసీసీ రీజియన్స్‌ నుంచి ఎంపిక చేశారు. వాటిలో అమెరికా(యూఎస్‌ఏ) కూడా ఒకటి. తాజాగా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్‌-19 వుమెన్స్‌ టి20 టోర్నమెంట్‌కు యూఎస్‌ఏ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.  

అయితే క్రికెట్‌ అమెరికా ప్రకటించిన జట్టు చూస్తుంటే.. అసలు ఆడుతుంది అమెరికా లేక భారత్‌ అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే జట్టుకు ఎంపికచేసిన 15 మంది భారత సంతతికి చెందినవాళ్ల కావడం గమనార్హం. ఇక రిజ్వర్స్‌ కేటగిరలో ఎంపిక చేసిన ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు భారత్‌కే చెందిన వారే ఉన్నారు. ఇలా జట్టు మొత్తం భారతీయుల పేర్లతో నిండిపోయింది. ఇది గమనించిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. అమెరికా జట్టులాగా లేదు.. ఇండియా-బి టీమ్‌ ‍స్క్వాడ్‌లాగా ఉంది అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక జట్టు హెడ్‌కోచ్‌గా విండీస్‌ మాజీ క్రికెటర్‌ శివ్‌నరైన్‌ చందర్‌పాల్‌ను ఎంపిక చేసింది. 

ఇక ఐసీసీ తొలి అండర్‌-19 వుమెన్స్‌ టి20 వరల్డ్‌కప్‌ 2023 జనవరి 14 నుంచి జనవరి 29 వరకు జరగనుంది. జనవరి 27న జరిగే సెమీఫైనల్స్‌కు జేబీ మార్క్స్‌ ఓవల్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత జనవరి 29న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది.

U-19 టోర్నమెంట్ కోసం యూఎస్‌ఏ ప్రకటించిన  జట్టు:
గీతిక కొడాలి (కెప్టెన్), అనికా కోలన్ (వికెట్‌ కీపర్‌, వైస్ కెప్టెన్), అదితి చూడసమా, భూమిక భద్రిరాజు, దిశా ధింగ్రా, ఇసాని వాఘేలా, జీవన అరస్, లాస్య ముళ్లపూడి,  పూజా గణేష్ (వికెట్‌ కీపర్‌), పూజా షా, రీతూ సింగ్ ,సాయి తన్మయి ఎయ్యుణ్ణి,స్నిగ్ధా పాల్, సుహాని తడాని, తరణం చోప్రా

రిజర్వ్ ప్లేయర్స్: చేతన ప్రసాద్, కస్తూరి వేదాంతం, లిసా రామ్‌జిత్, మిటాలి పట్వర్ధన్, త్యా గొన్సాల్వేస్

కోచింగ్, సహాయక సిబ్బంది:
ప్రధాన కోచ్: శివనారాయణ్ చంద్రపాల్
టీమ్ మేనేజర్: జాన్ ఆరోన్
జట్టు విశ్లేషకుడు: రోహన్ గోసాల
అసిస్టెంట్ కోచ్: బర్ట్ కాక్లీ
ఫిజియో/మెడికల్: డా. ఆడ్రీ ఆడమ్స్
అసిస్టెంట్ టీమ్ మేనేజర్: జోన్ అలెగ్జాండర్-సెరానో

చదవండి: కల చెదిరింది.. ప్రాణం తీసిన గుర్రపు పందెం

కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్‌ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది

మరిన్ని వార్తలు