Tokyo Olympics: అయ్యో అమెరికా!

30 Mar, 2021 10:08 IST|Sakshi

గ్వాడలహారా (మెక్సికో): టోక్యో ఒలింపిక్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి అమెరికా జట్టు అర్హత పొందలేకపోయింది. ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్‌ దేశాల ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోరీ్న సెమీఫైనల్లో హోండురస్‌ 2-1తో అమెరికాను ఓడించి  ‘టోక్యో’ బెర్త్‌ దక్కించుకుంది. ఒలింపిక్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి అమెరికా అర్హత పొందకపోవడం వరుసగా ఇది మూడోసారి. 

భారత్‌ 0 యూఏఈ 6
దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జట్టుతో సోమవారం జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో భారత జట్టు 0-6 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. యూఏఈ తరఫున అలీ మబ్‌ఖౌత్‌ మూడు గోల్స్‌ (12వ, 32వ, 60వ ని.లో) చేయగా... లిమా (71వ, 84వ ని.లో) రెండు గోల్స్‌... ఖలీల్‌ (64వ ని.లో) ఒక గోల్‌ సాధిచారు.

మరిన్ని వార్తలు