ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..

31 May, 2021 17:31 IST|Sakshi

దుబాయ్‌: కరోనా కారణంగా అ‍ర్ధంతంగా నిలిచిపోయిన ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 10 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లకు పేక్షకులను అనుమతించాలని ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) నిర్ణయించింది. కోవిడ్‌ నేపథ్యంలో గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించారు. అయితే, ప్రస్తుతం ఆ దేశంలో కరోనా అదుపులోనే ఉండటంతో పాటు 70 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్‌ పూర్తి కావడంతో మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. 

ప్రతి మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ సెకండాఫ్‌ మ్యాచ్‌ల నిర్వహణ, ప్రేక్షకులను అనుమతించే విషయంపై బీసీసీఐ ఉన్నతాధికారుల బృందం వచ్చే బుధవారం ఈసీబీ అధికారులను కలవనుంది. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం టీకాలు వేసుకున్న ప్రేక్షకులకు అనుమతించవచ్చని ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు.
చదవండి: దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు