ఆ క్రికెటర్ ఇంట్లో మరోసారి విషాదం..!

7 May, 2021 00:32 IST|Sakshi

బెంగళూరు: భారత మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి ఇంట మరోసారి విషాదం చోటు చేసుకుంది. గత ఏప్రిల్‌ 23న కరోనా వైరస్‌ కారణంగా వేద తల్లి చెలువాంబా దేవి మృతి చెందగా... బుధవారం సాయంత్రం వేద సోదరి వత్సల కరోనాతో పోరాడి తనువు చాలించింది. 42 ఏళ్ల వత్సల చిక్‌మగళూరులోని ఓ ఆసుపత్రిలో రెండు వారాలపాటు చికిత్స పొందింది. ఆమె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉండటంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది.

కడూర్‌లో నివసించే వేద తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఏప్రిల్‌ ఆరంభంలో కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో కుటుంబసభ్యులతో గడిపిన 28 ఏళ్ల వేద బెంగళూరుకు తిరిగి వచ్చి ఐసోలేషన్‌లో గడిపింది. ఆమెకు కరోనా పరీక్ష చేయగా నెగెటివ్‌ వచ్చింది. బెంగళూరుకు చెందిన వేద కృష్ణమూర్తి భారత్‌ తరఫున 48 వన్డేలు ఆడి 829 పరుగులు... 76 టి20 మ్యాచ్‌లు ఆడి 875 పరుగులు సాధించింది.   


చదవండి: అదే మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాం: రోహిత్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు