బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోను  అదరగొడుతున్న కేకేఆర్‌ ఓపెనర్‌..

28 Sep, 2021 17:48 IST|Sakshi
Courtesy: IPL Twitter

Venkatesh Iyer: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌  నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ కేకేఆర్‌ బౌలర్ల ధాటికి 127 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాట్స్‌మన్‌లో స్టీవ్‌ స్మీత్‌(39),కెప్టెన్‌ పంత్‌(39) తప్ప మిగతా బ్యాట్స్‌మన్‌లు ఎవరూ రాణించలేదు. అయితే ఐపీఎల్‌ సెకండ్‌ఫేజ్‌లో కేకేఆర్‌ తరుపున బ్యాటింగ్‌లో  అదరగొడుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌ బౌలింగ్‌లోను రాణించాడు.

ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ వేసిన అయ్యర్‌.. హెట్‌మైర్‌ను ఔట్‌ చేసి ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ సాధించాడు. కాగా నాలుగు ఓవర్లు వేసిన వెంకటేశ్‌ అయ్యర్‌ 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతా బౌలర్లో సునీల్‌ నరైన్‌, లోకీ ఫెర్గూసన్, వెంకటేష్ అయ్యర్ చేరో రెండు వికెట్లు పడగొట్టారు.

చదవండి: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌..


 

మరిన్ని వార్తలు