టీమిండియా ఆల్‌రౌండర్‌కు గాయం.. టోర్నీ నుంచి ఔట్‌!

20 Oct, 2022 16:17 IST|Sakshi

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ గాయం కారణంగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2022 నుంచి తప్పుకున్నాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్‌.. ప్రాక్టీస్‌ చేస్తుండగా అతడి చీలమండకి తీవ్ర గాయమైంది.  ఈ క్రమంలో టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల మొత్తానికి అయ్యర్‌ దూరమయ్యాడు.

కాగా ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రైల్వేస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అయ్యర్‌ ఆల్‌ రౌండ్‌ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తొలుత 62 పరుగులతో ఆజేయంగా నిలిచిన వెంకటేశ్‌.. బౌలింగ్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక తన గాయానికి సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా అయ్యర్‌ అందించాడు. 

"చీలమండ గాయం కారణంగా సయ్యద్‌ ముస్తాక్‌ ఆలీ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాను. త్వరలో మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని ఆశిస్తున్నాను. నేను జట్టుకు దూరమైన్పటికీ.. మా బాయ్స్‌ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నాను" అని సోషల్‌ మీడియాలో అయ్యర్‌ పోస్ట్‌ చేశాడు. 

కాగా ఐపీఎల్‌-2021లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అయ్యర్‌కు భారత జట్టులో చోటు దక్కింది. అయితే జట్టులో మాత్రం తన స్థానాన్ని అయ్యర్‌ సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు,  రెండు వన్డేల్లో అయ్యర్‌ ప్రాతినిథ్యం వహించాడు.

A post shared by Venkatesh R Iyer (@venkatesh

మరిన్ని వార్తలు