అత్యుత్తమ వ‌న్డే జట్టు ఎంపిక.. రోహిత్ శ‌ర్మ‌కి నో ఛాన్స్‌!

8 Feb, 2022 12:35 IST|Sakshi

టీమిండియా మాజీ పేస‌ర్ వెంకటేష్ ప్రసాద్ త‌న‌ ఆల్-టైమ్ ఇండియ‌న్ బెస్ట్‌  వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్ర‌క‌టించాడు.  అత‌డు ప్ర‌క‌టించిన జ‌ట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనిను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. ఓపెన‌ర్లుగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్‌లకు అత‌డు అవ‌కాశం ఇచ్చాడు. ఇక భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి 3వ స్థానంలో చోటు ద‌క్క‌గా, క్రికెట్ లెజెండ్ మహమ్మద్ అజారుద్దీన్‌కి నాలుగో స్ధానంలో చోటు ద‌క్కింది.

ఇక ఐదో స్ధానంలో యువరాజ్ సింగ్‌కి అవ‌కాశం ఇవ్వ‌గా, ఆరో స్ధానంలో ధోనికి చోటు ఇచ్చాడు. ఆల్‌రౌండ‌ర్ల కోటాలో భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ కపిల్ దేవ్‌ను వెంక‌టేష్ ప్ర‌సాద్ ఎంపిక చేశాడు. ఇక త‌న జ‌ట్టులో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగల్ శ్రీనాథ్, జ‌హీర్ ఖాన్‌ను బౌల‌ర్లుగా వెంక‌టేష్ ప్ర‌సాద్ ఎంచ‌కున్నాడు. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కి వెంక‌టేష్ ప్ర‌సాద్ ప్ర‌క‌టించిన జ‌ట్టులో చోటు ద‌క్కక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వెంకటేష్ ప్రసాద్ వ‌న్డే అత్య‌త్తుమ జ‌ట్టు: వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహమ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, ఎంస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్

చ‌ద‌వండి: 25 ఏళ్ల త‌ర్వాత పాక్ ప‌ర్య‌ట‌న‌కు.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆసీస్‌

మరిన్ని వార్తలు