Belgian GP: వెర్‌స్టాపెన్‌ ఖాతాలో తొమ్మిదో విజయం

29 Aug, 2022 13:38 IST|Sakshi

ఫార్ములావన్‌–2022 సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ తొమ్మిదో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రిలో 14వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన వెర్‌స్టాపెన్‌ నిర్ణీత 44 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 25 నిమిషాల 52.894 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

పెరెజ్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్‌లో 14 రేసులు ముగిశాక వెర్‌స్టాపెన్‌ 284 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
చదవండి: US Open 2022: సెరెనాపైనే దృష్టి

మరిన్ని వార్తలు