వెర్‌స్టాపెన్‌ ‘పోల్‌’ సిక్సర్‌

29 Aug, 2021 05:48 IST|Sakshi

స్పా ఫ్రాంకోర్‌ చాంప్స్‌ (బెల్జియం): ఫార్ములావన్‌ (ఎఫ్‌1) తాజా సీజన్‌లో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఆరోసారి పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ చివరి సెషన్‌లో ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 59.765 సెకన్లలో పూర్తి చేసిన వెర్‌స్టాపెన్‌ పోల్‌ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.321 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసిన విలియమ్స్‌ డ్రైవర్‌ జార్జ్‌ రసెల్‌ రెండో స్థానంలో నిలవగా... మూడో స్థానంలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసును సాయంత్రం గం. 6:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–2, హాట్‌స్టార్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు