మెక్సికో గ్రాండ్‌ప్రి విజేత వెర్‌స్టాపెన్‌..

9 Nov, 2021 10:13 IST|Sakshi

Verstappen wins Formula 1 Mexican Grand Prix:  ఫార్ములావన్‌ సీజన్‌లో భాగంగా జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల రేసును వెర్‌స్టాపెన్‌ గంటా 38 నిమిషాల 39.086 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది తొమ్మిదో విజయం. 16.555 సెకన్ల తేడాతో హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానాన్ని పెరెజ్‌ (రెడ్‌బుల్‌) దక్కించుకున్నాడు.

చదవండి: Akshay Karnewar: 4–4–0–2.. అక్షయ్‌ కర్నేవార్‌ అరుదైన రికార్డు

మరిన్ని వార్తలు