IND vs SL: 'పింక్‌బాల్‌ టెస్టు సవాల్‌తో కూడుకున్నది.. మానసికంగా సిద్ధం'

11 Mar, 2022 13:58 IST|Sakshi

శ్రీలంకతో టీమిండియా పింక్‌బాల్‌ టెస్టు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు వైస్‌కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్పందించాడు. వర్చువల్‌ మీడియా కాన్ఫరెన్స్‌లో భాగంగా బుమ్రా మాట్లాడాడు.

''డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడుతున్నామంటే దానికి మానసికంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఫ్లడ్‌లైట్ల వెళుతురులో ఫీల్డింగ్‌, బౌలింగ్‌ చేయడం కాస్త సవాల్‌తో కూడుకున్నది. వన్డే, టి20 అయితే ఒక్క రోజులో ముగుస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ పింక్‌బాల్‌ టెస్టు అంటే ఐదురోజులు ఫ్లడ్‌లైట్స్‌ వెళుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే వీటన్నింటిన మైండ్‌లో పెట్టుకొని మా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నాం.

మేము పెద్దగా డే అండ్‌ నైట్‌ ఎక్కువగా ఆడలేదు కాబట్టి.. ప్రతీ పింక్‌బాల్‌ టెస్టులో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండాలా లేక ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌ తీసుకోవాలా అనేది ఆలోచిస్తున్నాం. డే అండ్‌ నైట్‌ టెస్టు అంటే పింక్‌బాల్‌ కాస్త కొత్తగా అనిపిస్తుంది. రాత్రిళ్లు పిచ్‌ సీమర్లకు అనుకూలిస్తుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటే సిరాజ్‌కు చోటు ఉండొచ్చు.. లేదంటే అక్షర్‌ తుది జట్టులోకి రావొచ్చు. దీనికి సంబంధించిన పారామీటర్స్‌ను ఇంకా సిద్ధం చేసుకోలేదు.'' అంటూ వివరించాడు.

ఇక బుమ్రా టీమిండియా తరపున 28 టెస్టుల్లో 115 వికెట్లు తీశాడు. తొలి టెస్టులో టీమిండియా 222 పరుగుల ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇక ఇప్పటివరకు టీమిండియా మూడు పింక్‌బాల్‌ టెస్టులు ఆడింది. ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌లతో ఆడిన మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో మాత్రం ఓటమి చవిచూసింది. అటు లంక కూడా మూడు పింక్‌బాల్‌ టెస్టులు ఆడగా.. రెండింటిలో గెలిచి.. ఒకదాంట్లో ఓటమి చూసింది.

చదవండి: Shaheen Afridi-Jadeja: జడ్డూను కాపీ కొట్టిన పాక్‌ బౌలర్‌.. ట్రోల్స్‌ చేసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌

Rohit Sharma-Gavaskar: 'రోహిత్‌.. కుదురుకునే వరకు ఆ షాట్‌ ఆడకపోవడం ఉత్తమం'

మరిన్ని వార్తలు