'మోసం చేయడం కళ.. అందరికి అబ్బదు'

12 Sep, 2020 11:37 IST|Sakshi

దుబాయ్‌ : తన ఆఫ్‌ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టేందుకు రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. గత రెండు సీజన్లలో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్‌ డిసెంబర్‌ 2019లో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా అశ్విన్‌ నెట్స్‌లో తన బౌలింగ్‌ పదును కోసం కఠోర సాధన చేస్తున్నాడు. తన ప్రాక్టీస్‌ వీడియోను అశ్విన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. (చదవండి : ఐపీఎల్‌.. తేల్చుకుందాం రండి)

'మనం చేసేది తప్పా లేక ఒప్పా అన్నది కేవలం అవగాహన మాత్రమే.. అందుకే బౌలింగ్‌తో ఎదుటివారిని ముప్పతిప్పలు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.. మోసం చేయడం అనేది ఒక కళ.. అది అందరికి అబ్బదు. ' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. అశ్విన్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 139 మ్యాచ్‌లాడి.. 125 వికెట్లు తీశాడు. మరోవైపు ఇంతవరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరని జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలిచింది.

2019లో శ్రేయాస్‌ అయ్యర్‌ సారధ్యంలో యువ ఆటగాళ్లతో నిండిన ఈ జట్టు గతేడాది అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈసారి ఢిల్లీ జట్టుకు అధనంగా అశ్విన్‌, అజింక్యా రహానే, మార్కస్‌ స్టోయినిస్‌ లాంటి ఆటగాళ్లు చేరడం మరింత బలం చేకూర్చింది. సెప్టెంబర్‌ 20న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. నవంబర్‌ 2న జరిగే లీగ్‌ ఆఖరి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది. మరి ఈ సారి ఢిల్లీ ప్రదర్శన ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం.

Right or wrong is just a perception, and that’s why they say “deception is an art”. #ipl2020 #covid19

A post shared by Stay Indoors India 🇮🇳 (@rashwin99) on

మరిన్ని వార్తలు