T20 WC ENG Vs NZ: సీరియస్‌ మ్యాచ్‌లో ఇంత బిల్డప్‌ అవసరమా!

1 Nov, 2022 20:54 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌, కివీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఒక పక్క సీరియస్‌గా మ్యాచ్‌ జరుగుతుంటే తనకేం పట్టనట్లుగా ఒక అభిమాని మాత్రం బుక్‌ చదువుతూ బిల్డప్‌ కొట్టడం తెగ వైరల్‌గా మారింది. విచిత్రమేంటంటే.. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైనప్పుడు చదవడం మొదలుపెట్టిన సదరు వ్యక్తి.. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసేవరకు పుస్తకం మూయకుండా సీరియస్‌గా చదవడం గమనార్హం.

ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ''పాపం మ్యాచ్‌ కంటే అతనికి బుక్‌ ఎక్కువ ఎంజాయ్‌మెంట్‌ ఇస్తుందనుకుంటా.. ఆ మాత్రం దానికి స్టేడియానికి రావడం ఎందుకు.. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చదివితే సరిపోయేది కదా'' అంటూ కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోపై మీరు ఒక లుక్కేయండి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బట్లర్‌ సేన న్యూజిలాండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (40), గ్లెన్‌ ఫిలిప్స్‌ (36 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలం కావడం కివీస్‌ ఓటమికి ప్రధాన కారణం.ఆఖర్లో సాంట్నర్‌ (16 నాటౌట్‌), సోధి (6 నాటౌట్‌) జట్టును గెలిపించేందకు ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

చదవండి: ఇంగ్లండ్‌ విజయాలను శాసిస్తున్న చివరి ఆరు ఓవర్లు 

ఇంగ్లండ్‌ తరపున తొలి బ్యాటర్‌గా జాస్‌ బట్లర్‌

కేఎల్‌ రాహుల్‌కు కోహ్లి పాఠాలు

మరిన్ని వార్తలు