పాక్‌ జలసంధిని ఈదిన విజయవాడ స్విమ్మర్లు

24 Apr, 2022 08:32 IST|Sakshi
పాక్‌ జలసంధిని ఈదిన ఆరుగురు స్విమ్మర్లు వీరే.. 

విజయవాడ స్పోర్ట్స్‌: భారత్, శ్రీలంక మధ్యనున్న పాక్‌ జలసంధిని ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన స్మిమ్మర్లు కె.బేబీ స్పందన, బి.అలంకృతి, పి.రాహుల్, కె.జార్జ్, కె.జాన్సన్, టి.సాత్విక్‌లు విజయవంతంగా ఈదారు. వీరిలో అలంకృతి తొమ్మిదో తరగతి చదువుతుండగా, జార్జ్, జాన్సన్, సాత్విక్‌లు పదో తరగతి, బేబీ స్పందన డిగ్రీ, రాహుల్‌ బీటెక్‌ చదువుతున్నారు. 34 కిలోమీటర్ల జలసంధిని వీరు 9 గంటల 28 నిమిషాల్లో ఈత పూర్తి చేశారు.

చదవండి👉: IPL 2022: ఎదురులేని ఎస్‌ఆర్‌హెచ్‌.. ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు

ఉమ్మడి కృష్ణా జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌కు చెందిన ఈ జట్టు తొలుత ఈ నెల 22వ తేదీ సాయంత్రం ధనుష్కోటి నుంచి బోటు ద్వారా శ్రీలంక తీరానికి చేరుకున్నారు. శ్రీలంక తీరం నుంచి శనివారం ఒంటి గంటకు ఈత ప్రారంభించి 10 గంటల 28 నిమిషాల 27 సెకన్లకు రామేశ్వరంలోని ధనుష్కోటికి చేరుకున్నారు. హెడ్‌ కానిస్టేబుల్, అంతర్జాతీయ స్విమ్మర్‌ తులసి చైతన్య శిక్షణలో ఈ జట్టు పాక్‌ జలసంధిని ఈదినట్లు కృష్ణా జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఐ.రమేష్‌ తెలిపారు. ఈ సాహసకృత్యాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు