‘కామన్వెల్త్‌’కు వినేశ్ ఫొగాట్‌, సాక్షి మలిక్‌

17 May, 2022 08:06 IST|Sakshi

లక్నో: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ భారత జట్టులో పునరాగమనం చేసింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత రెజ్లింగ్‌ జట్టులో వినేశ్‌ చోటు సంపాదించింది. రియో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మరో సీనియర్‌ రెజ్లర్‌ సాక్షి మలిక్‌ కూడా జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. సోమవారం జరిగిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో వినేశ్‌ 53 కేజీల విభాగంలో... సాక్షి 62 కేజీల విభాగంలో విజే తగా నిలి చి కామన్వెల్త్‌ గేమ్స్‌ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. వినేశ్, సాక్షిలతోపాటు పూజా (50 కేజీలు), అన్షు (53 కేజీలు), దివ్య కక్రాన్‌ (68 కేజీలు), పూజా సిహాగ్‌ (76 కేజీలు) కూడా ‘కామన్వెల్త్‌’లో భారత్‌ తరఫున ఆడతారు. 

>
మరిన్ని వార్తలు