వినుకొండ యువకుడి ప్రతిభ: పరుగు పందెంలో పసిడి పతకం!  

13 Aug, 2021 11:34 IST|Sakshi
బంగారు పతకంతో షేక్‌ అబ్దుల్లా

వినుకొండ (నూజెండ్ల): అంతర్జాతీయ పోటీల్లో గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన షేక్‌ అబ్దుల్లా 5 కిలో మీటర్ల పరుగు పందెం విభాగంలో తొలి స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. భూటాన్‌లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు 3వ సౌత్‌ ఏషియన్‌ రూరల్‌ గేమ్స్‌ జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 4 దేశాల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, అబ్దుల్లా గతంలో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో యూత్‌ రూరల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన జాతీయస్థాయి రన్నింగ్‌ పోటీల్లో 2 సార్లు, అంతర్జాతీయ స్థాయిలో నేపాల్‌లో జరిగిన పోటీల్లో 2 సార్లు గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే....  
అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ముందు అబ్దుల్లా ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అబ్దుల్లాకు రూ. 50 వేల ఆర్థికసాయాన్ని చేసింది. ఈ మొత్తాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సమక్షంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అబ్దుల్లాకు అందజేశారు. దీనిపై అబ్దుల్లా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రోత్సహిస్తే 2024 ఒలింపిక్స్‌లో కూడా ప్రతిభ కనబరుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.      

మరిన్ని వార్తలు