వికెట్‌ తీయగానే జెర్సీ విప్పేసిన తాహిర్‌

4 Mar, 2021 11:14 IST|Sakshi

కరాచీ: దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాహిర్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ముల్తాన్‌ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బుధవారం క్వెటా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసిన ఆనందంలో జెర్సీ విప్పేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే తాహిర్‌ ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది.

అదేంటంటే.. గత జనవరి 10న పాకిస్తాన్‌ లోకల్‌ క్రికెటర్‌ తాహిర్‌ ముగల్‌ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 503 వికెట్లు తీసిన 43 ఏళ్ల ముగల్‌ ప్రస్తుతం లాహారి కోచ్‌గా పనిచేసేవాడు. ఆయన మృతికి నివాళిగా తాహిర్‌ జెర్సీ తీసేశాడు. అయితే తాహిర్‌..  ముగల్‌ ఫోటో ఉన్న షర్ట్‌ను ధరించి అతనికి ఘనమైన నివాళి అందించాడు. "మై బ్రదర్‌ మిస్‌ యూ.. రిప్‌" అంటూ షర్ట్‌పై రాసి ఉంది. తాహిర్‌ చర్యతో ఆశ్యర్యపోయిన సహచర ఆటగాళ్లు తర్వాత విషయం తెలుసుకొని అతన్ని అభినందనలతో ముంచెత్తారు. ​కాగా ఇమ్రాన్‌ తాహిర్ ‌పీఎస్‌ఎల్‌లో బుధవారం ఆడిన మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ తీశాడు. ఈ వీడియోనూ పీఎస్‌ఎల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ (51 బంతుల్లో 81, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్‌ సుల్తాన్‌ 19.4 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌటైంది. ముల్తాన్‌ ఇన్నింగ్స్‌లో ఎవరు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు.. గ్లాడియేటర్స్‌ బౌలర్లలో కైస్‌ అహ్మద్‌ 3 వికెట్లతో రాణించాడు.
చదవండి: 
1889 తర్వాత మళ్లీ ఇప్పుడే..
రెచ్చిపోయిన పొలార్డ్‌.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు
'ఆ వ్యాఖ్యలు చేసుంటే నన్ను క్షమించండి'

మరిన్ని వార్తలు