ఒక్కరు కాదు ముగ్గురు క్యాచ్‌ పట్టారు.. ఊహించని ట్విస్ట్‌

14 Oct, 2021 12:14 IST|Sakshi

South Australia Fielders Trying To Bizarre Catch:  ఆస్ట్రేలియాలో జరుగుతున్న మార్ష్ కప్ టోర్నమెంట్‌లో బుధవారం జరిగిన దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ క్యాచ్‌ను పట్టేందుకు ముగ్గురు ఫీల్డర్స్ ప్రయత్నించారు. చివరకి ఏమి జరిగిందో మీకు తెలుసా.. క్వీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్ 36 వ ఓవర్ వేసిన బ్రెండన్ డాగెట్ బౌలింగ్‌లో మైఖేల్ నాసర్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించగా.. అది మిస్‌ టైమ్‌ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఇక క్యాచ్‌ పట్టుకునేందకు ముగ్గురు ఫీల్డర్స్ బౌండరీ లైన్ వైపు పరిగెత్తారు.  వీరిలో ఓ ఫీల్డర్ ఆ క్యాచ్‌ను అందుకున్నా.. అతడు అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు.

మరో ఫీల్డర్‌ దాన్ని అందుకున్నప్పటికి .. అతడు కూడా అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. ఈ క్రమంలో మూడో ఫీల్డర్‌ కూడా బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటేశాడు. చివరికి వీరి ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అంపైర్ దాన్ని సిక్స్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన సౌత్‌ ఆస్ట్రేలియా 392 పరుగుల భారీ లక్ష్యాన్ని క్వీన్స్‌లాండ్‌ ముందట ఉంచింది. 392 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్‌లాండ్‌ 40 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 67 పరుగుల తేడాతో సౌత్‌ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌ ట్రెవీస్‌ హెడ్‌ ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు.

చదవండి: T20 World Cup 2021: హార్దిక్‌ పాండ్యా జట్టులోనే.. బౌలింగ్‌ మాత్రం చేయడు!

మరిన్ని వార్తలు