మరోసారి తండ్రి అయిన విరాట్‌ కోహ్లి

20 Feb, 2024 21:19 IST|Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి రెండోసారి తండ్రి అయ్యాడు. విరాట్‌ భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరుష్క దంపతులు కొద్ది సేపటి క్రితం ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. బిడ్డకు 'అకాయ్‌' (Akaay) అని నామకరణం​ చేసినట్లు వారు పేర్కొన్నారు.

మా జీవితంలోని ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని అభ్యర్థిస్తున్నాము. ప్రేమ మరియు కృతజ్ఞతతో విరాట్ మరియు అనుష్క అంటూ విరుష్క దంపతులు ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

కాగా, విరాట్‌ తండ్రి కాబోతున్నాడని గతకొంతకాలంగా సోషల్‌మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా, కోహ్లి సహచరుడు, దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ సోషల్‌మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2017లో విరాట్‌ కోహ్లిని పెళ్లాడిన అనుష్క శర్మ.. 2021లో మొదటి సంతానం వామికకు జన్మనిచ్చింది.

ఇదిలా ఉంటే, విరాట్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లకు విరాట్‌ దూరంగా ఉన్నాడు. సిరీస్‌ ప్రారంభానికి ముందే విరాట్‌ బీసీసీఐ వద్ద పర్మిషన్‌ తీసుకున్నాడు.

whatsapp channel

మరిన్ని వార్తలు