IND vs BAN: బంగ్లాదేశ్‌ గడ్డపై కింగ్‌ కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

10 Dec, 2022 13:59 IST|Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ విరాట్‌ రికార్డులకెక్కాడు. ఛాటోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో 59 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ కింగ్‌ కోహ్లి ఈ మైలు రాయిని అందుకున్నాడు.

ఇప్పటి వరకు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర(1045) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సంగక్కర రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. కాగా తొలి రెండు వన్డేల్లో విఫలమైన విరాట్‌ ఆఖరి వన్డేలో మాత్రం దుమ్మురేపుతున్నాడు.

అతడితో పాటు ఇషాన్‌ కిషన్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 34 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 285 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్‌ కిషన్‌(197), కోహ్లి(82) పరుగులతో ఉన్నారు.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. 12 ఏళ్ల తర్వాత భారత బౌలర్‌ రీ ఎంట్రీ!

మరిన్ని వార్తలు