విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

30 Nov, 2022 14:04 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లికి ఉన్న ఫాలోయింగ్‌ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కింగ్‌ కోహ్లికి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అదే విధంగా సోషల్‌ మీడియాలో కూడా విరాట్‌కు ఫాలోవర్లు కూడా భారీగానే ఉన్నారు. అతడు పెట్టే పోస్టులకోసం నెటిజన్లు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు.

విరాట్‌ ఏ పోస్టు పెట్టినా అది కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారిపోతుంది. ఇక తాజాగా ఫేస్‌బుక్‌లో విరాట్‌ పాలోవర్ల  సంఖ్య  50 మిలియన్లకు చేరింది. తద్వారా విరాట్‌ కోహ్లి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ట్విటర్‌, ఇనస్ట్రాగమ్‌, ఫేస్‌బుక్‌ మూడు సోషల్‌ మీడియా ఖాతాలలో 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు.

ఇప్పటికే విరాట్‌కు ట్విటర్‌, ఇనస్ట్రాగమ్‌లో 50 మిలియన్ల పైగా ఫాలోవర్ల ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పరంగా పోర్చ్‌గల్‌ ఫుట్‌బాల్ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో 505 మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ( 381 మిలియన్లు), విరాట్‌ కోహ్లి(221 మిలియన్లు),  నేమర్ జూనియర్(187 మిలియన్లు)తో కోనసాగుతున్నారు.

ఇక టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నిరాశపరిచినప్పటికీ.. కోహ్లి మాత్రం అదరగొట్టాడు. 296 పరుగులతో  విరాట్‌ టోర్నీ టప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా టీ20 ప్రపంచకప్‌ అనంతరం న్యూజిలాండ్‌ టూర్‌కు దూరమైన కింగ్‌ కోహ్లి మళ్లీ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌తో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. 
చదవండి: IND vs NZ: అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్‌ మాజీ క్రికెటర్‌


 

మరిన్ని వార్తలు