#ViratKohli: ICC నాకౌట్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా

10 Jun, 2023 22:58 IST|Sakshi

టీమిండియా స్టార్‌ కింగ్‌ కోహ్లికి రికార్డులు కొత్త కాదు. ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు.  తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా కొన్ని రికార్డులను అందుకున్నాడు.  అవేంటనేది ఒకసారి పరిశీలిద్దాం.

ఐసీసీ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు.  ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు సచిన్‌ టెండూల్కర్‌ 657 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా కోహ్లి సచిన్‌ను అధిగమించి 660 పరుగులతో లీడింగ్‌ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

డబ్ల్యూటీసీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై కోహ్లి 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు, అదే సమయంలో టెస్టుల్లోనూ ఆసీస్‌పై 2వేల పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం.

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో 444 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కోహ్లి 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతుండగా.. రహానే 20 పరుగులతో సహకరిస్తున్నాడు. ఇక చివరిరోజు ఆటలో టీమిండియా విజయానికి 280 పరుగులు అవసరం కాగా.. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి.

చదవండి: 'చీటింగ్‌ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!'

మరిన్ని వార్తలు