Asia Cup 2022 Ind Vs HK: ఆరేళ్ల తర్వాత కింగ్‌ కోహ్లి బౌలింగ్‌.. అభిమానులు ఫిదా!

1 Sep, 2022 09:40 IST|Sakshi

ఆసియాకప్‌-2022లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి బౌలింగ్‌ చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. టీ20 క్రికెట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత కోహ్లి బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే వేశాడు. హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన కోహ్లి.. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇ‍చ్చాడు.

కోహ్లి బౌలింగ్‌కు అతడి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా కోహ్లి టీ20ల్లో చివరగా 2016 ఆసియాకప్‌లో బౌలింగ్‌ చేశాడు. ఇప్పటి వరకు 101 టీ20లు ఆడిన కోహ్లి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి తొలుత బ్యాటింగ్‌లో కూడా అదరగొట్టాడు. విరాట్‌ 44 బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ముఖ్యంగా సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి 98 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని కింగ్‌ కోహ్లి నెలకొల్పాడు. ఇక ఈ ఏడాదిలో కోహ్లికి ఇది రెండో టీ20 హాఫ్‌ సెంచరీ. కాగా టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి ఈ తరహా ఇన్నింగ్స్‌ ఆడటం జట్టుకు సానుకూలాంశం. ఇక ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై భారత్‌ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


చదవండి: IND VS HK: గ్రౌండ్‌లోనే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్‌ క్రికెటర్‌.. వీడియో వైరల్‌!

మరిన్ని వార్తలు