టి20 క్రికెట్‌లో కోహ్లి అరుదైన ఘనత

24 Sep, 2021 22:13 IST|Sakshi

Virat Kohli Most Runs Against An Opponent T20 Cricket.. ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టి20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అర్థ సెంచరీతో రాణించాడు. కాగా కోహ్లి సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌ ద్వారా వ్యక్తిగతంగా ఐదు జట్లపై అ‍త్యధిక పరుగులు సాధించిన జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఇందులో సీఎస్‌కేపై 939 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్‌ 933 పరుగులు, కేకేఆర్‌ 735 పరుగులు, ముంబై ఇండియన్స్‌ 728 పరుగులు, ఆస్ట్రేలియా 718 పరుగులు సాధించాడు.

ఇక మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్‌), పడిక్కల్‌(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించినప్పటికి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలం కావడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా కోహ్లి, పడిక్కల్‌ మధ్య 111 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం విశేషం. ఇక సీఎస్‌కే బౌలర్లలో బ్రావో 3, శార్దూల్‌ ఠాకూర్‌ 2, దీపక్‌ చహర్‌ 1 వికెట్‌ తీశాడు. 

చదవండి: Dhoni-Kohli Chit Chat: టాస్‌కు ముందు కోహ్లి, ధోని ఏం మాట్లాడుకున్నారు?

మరిన్ని వార్తలు