Virat Kohli: లండన్‌లో వామికతో కోహ్లి.. ఫొటో చూశారా?

27 Feb, 2024 10:44 IST|Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఆటకు కాస్త విరామం ఇచ్చాడు. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ కుటుంబానికి సమయం కేటాయించాడు. భార్య అనుష్క శర్మ, కూతురు వామిక, చిన్నారి కుమారుడు అకాయ్‌తో కలిసి గడుపుతున్నాడు. 

కాగా అనుష్క ప్రసవం నేపథ్యంలో విరాట్‌ కోహ్లి స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాము ఫిబ్రవరి 15న రెండో సంతానానికి జన్మనిచ్చినట్లు విరుష్క జోడీ వెల్లడించింది. వామికకు తమ్ముడు పుట్టాడని.. ఆ బుడతడికి అకాయ్‌గా నామకరణం చేసినట్లు తెలిపింది.

ఇక ప్రస్తుతం కోహ్లి ఫ్యామిలీ లండన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గారాల పట్టి వామికతో విరాట్‌ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తండ్రి పక్కన కూర్చుని ఉండగా వామిక తనంతట తానుగా ఫుడ్‌ తింటూ కనిపించడం విశేషం.

ఇదిలా ఉంటే.. దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్‌ కోహ్లి లేకుండానే టెస్టు సిరీస్‌ బరిలో దిగిన టీమిండియా ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. కుర్రాళ్లే అధికంగా ఉన్న జట్టుతో ఓ మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంపై స్పందించిన కోహ్లి కుర్రాళ్ల పట్టుదలతోనే ఈ గెలుపు సాధ్యమైందంటూ ప్రశంసలు కురిపించాడు.

కాగా ఇంగ్లండ్‌తో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌(52 నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: #Dhruv Jurel: ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు..

whatsapp channel

మరిన్ని వార్తలు