తొలిసారి ఆన్‌లైన్‌ ఓటింగ్‌.. మీకు నచ్చిన క్రికెటర్‌కు ఓటేయ్యండి

26 Nov, 2020 12:10 IST|Sakshi

దుబాయ్‌: గడిచిన దశాబ్దానికి సంబంధించి ఐసీసీ నామినేట్‌ చేసిన అవార్డుల జాబితాలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఐదు అవార్డుల కోసం పోటీ పడుతున్నాడు. ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ డెకేడ్‌తో పాటు ఐసీసీ టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ద డెకేడ్‌, ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద డెకేడ్‌, ఐసీసీ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద  డెకేడ్‌, ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు ఆఫ్‌ ద డెకేడ్‌ రేసులో కోహ్లి ఉన్నాడు.  పురుషుల, మహిళల విభాగాల్లో అవార్డుల జాబితాలను ఎంపిక చేసిన ఐసీసీ.. ఫ్యాన్స్‌ ఓటింగ్‌ ద్వారా విజేతలను ప్రకటించనుంది.  ఇలా ఫ్యాన్స్‌ ఓటింగ్‌  ద్వారా క్రికెటర్లను  విజేతలుగా ఐసీసీ ప్రకటించనుండటం ఇదే తొలిసారి. దీనికి సంబంధించి ఐసీసీ తన వెబ్‌సైట్‌లో క్రికెటర్ల పేర్లను ఓటింగ్‌ కోసం ఉంచింది.మెన్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్‌కు మొత్తం ఏడుగు ప్లేయ‌ర్స్ పోటీ పడుతున్నారు. అందులో కోహ్లితోపాటు ఇండియ‌న్ స్పిన్న‌ర్ అశ్విన్ కూడా దూకుడు మీదున్నాడు. ఈ ఇద్ద‌రు కాకుండా జో రూట్, కేన్ విలియ‌మ్స‌న్, స్టీవ్ స్మిత్ , ఏబీ డివిలియ‌ర్స్ , కుమార సంగ‌క్క‌ర ఉన్నారు. (చదవండి: కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్‌ రికార్డు)

మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారత క్రికెటర్లకు నిలిచారు. మెన్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్‌కు టీమిండియా  సారథి విరాట్ కోహ్లి నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం మొత్తం ఏడుగు ప్లేయ‌ర్స్ పోటీ పడుతున్నారు. అందులో కోహ్లితోపాటు ఇండియ‌న్ స్పిన్న‌ర్ అశ్విన్ కూడా ఉన్నాడు. ఈ ఇద్ద‌రు కాకుండా జో రూట్, కేన్ విలియ‌మ్స‌న్, స్టీవ్ స్మిత్ , ఏబీ డివిలియ‌ర్స్, కుమార సంగ‌క్క‌ర ఉన్నారు. ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ వ‌న్డే ప్లేయర్‌ల రేసులో కోహ్లితో పాటు ధోని, రోహిత్‌ శర్మలు భారత్‌ నుంచి పోటీ  పడుతున్నారు. ఇక లసిత్‌ మలింగ, మిచెల్‌ స్టార్క్‌, డివిలియర్స్‌, సంగక్కార కూడా పోటీలో ఉన్నారు.  దశాబ్దపు అత్యుత్తమ టీ20 ప్లేయర్‌ అవార్డు కోసం భారత్‌ నుంచి కోహ్లితో  పాటు రోహిత్ నామినేట్ అయ్యారు. ఈ లిస్ట్‌లో ర‌షీద్ ఖాన్‌, ఇమ్రాన్ తాహిర్‌, ఆరోన్ ఫించ్‌, మ‌లింగ‌, క్రిస్ గేల్ ఉన్నారు. దశాబ్దపు ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కోసం భారత్‌  నుంచి కోహ్లితో పాటు ధోని కూడా పోటీ ప‌డుతున్నాడు. 

మీకు నచ్చిన క్రికెటర్‌కు  ఓటేయ్యాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు