IND vs SL: కింగ్‌ కోహ్లి అరుదైన ఘనత.. జయవర్ధనే రికార్డు బ్రేక్‌

15 Jan, 2023 18:35 IST|Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 85 బంతుల్లో కోహ్లి తన 46 వన్డే సెంచరీని అందుకున్నాడు.  ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

జయవర్ధనే రికార్డు బద్దలు
ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన కింగ్‌ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లలో 12754 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు.

అదే విధంగా శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్‌ బ్యాటర్‌గా కూడా విరాట్‌ కోహ్లి(2503) నిలిచాడు. ఈ క్రమంలో  భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని(2383) రికార్డును రన్‌మిషన్ బ్రేక్‌ చేశాడు.
చదవండిIND vs SL: ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్‌ కోహ్లి

మరిన్ని వార్తలు