Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా

19 May, 2022 23:06 IST|Sakshi
PC: IPL Twitter

ఆర్‌సీబీ సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఆర్‌సీబీ తరపున ఐపీఎల్‌లో ఏడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లి ఈ ఘనత సాధించాడు. 235 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న కోహ్లి.. ఐపీఎల్‌లో ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. 2008లో ఆర్‌సీబీలో జాయిన్‌ అయిన కోహ్లి అప్పటి నుంచి అదే జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. కోహ్లి  ఆర్‌సీబీ తరపున 235 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగుల మార్క్‌ను అందుకోగా.. అందులో 424 పరుగులు చాంపియన్స్‌ లీగ్‌లో సాధించగా.. మిగతా పరుగులన్ని ఐపీఎల్‌లో వచ్చినవే. ఇక ఈ సీజన్‌లో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. కేవలం ఒక్క అర్థసెంచరీ మాత్రమే నమోదు చేసిన కోహ్లి 19.67 సగటుతో 236 పరుగులు సాధించాడు. 

ఇక గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తన మార్క్‌ ఆటతో కోహ్లి ఆకట్టుకున్నాడు. ప్లేఆఫ్‌ అవకాశాలు కష్టమే అయినప్పటికి భారీ తేడాతో గెలిస్తే అవకాశం ఉండడంతో కోహ్లి 54 బంతుల్లో 73 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఆర్‌సీబీకి రన్‌రేట్‌ మైనస్‌లో ఉండడం శాపంగా మారింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో గెలిచినప్పటికి.. ముంబైతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోతేనే ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ చేరుతుంది.. లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్‌ చేరుతుంది. 

చదవండి: IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్‌.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్‌

మరిన్ని వార్తలు