రెండో స్థానంలోనే కోహ్లి 

19 Aug, 2020 03:01 IST|Sakshi

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ 

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు సారథి విరాట్‌ కోహ్లి తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ విభాగంలో కోహ్లి 886 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా... చతేశ్వర్‌ పుజారా (8), అజింక్యా రçహానే (10) తమ స్థానాలను కాపాడుకున్నారు. ఈ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా మూడు, అశ్విన్‌ ఐదు ర్యాంకుల్లో ఉన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భారత్‌ 360 పాయింట్లతో ‘టాప్‌’ పొజిషన్‌ను కొనసాగిస్తోంది. ఆసీస్‌ (296)... ఇంగ్లండ్‌ (279) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు